న్యూఢిల్లీ, జూలై 9: భారత్‌లో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఎలాన్ మస్క్ సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయనకు చెందిన స్టార్‌లింక్‌నకు ది ఇండియన్ నేషనల్ స్పేస్ ఆథరైజేషన్ అండ్ ప్రమోషన్ సెంటర్(ఇన్‌స్పేస్) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఐదేండ్లపాటు శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించనున్నది.