Star Health Gift for Women | మహిళలు తమ కుటుంబం బాగోగుల కోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. కానీ తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు పాటుపడినట్లే వారి ఆరోగ్య పరిరక్షణపైనే ఫ్యామిలీ భవిష్యత్ ఆధార పడి ఉంటుంది. ప్రతి దశలోనూ మహిళలకు హెల్త్‌కేర్ అవసరం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు స్టార్హెల్త్ అండ్ అలాయిడ్ ఇన్సూరెన్స్ కొత్త వైద్య బీమా పాలసీ తెచ్చింది. 18-75 ఏండ్ల మధ్య వయస్సు గల మహిళల కోసం న్యూ `స్టార్ ఉమెన్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ` ప్రకటించింది.
స్టార్ హెల్త్ అండ్ అల్లయిడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ ఆనంద్ రాయ్ మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్య బీమా సేవలు సొంతంగా పొందడానికి తమ సంస్థ అనుమతిస్తుంది. స్టార్ ఉమెన్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక స్వతంత్ర, సమగ్ర పాలసీ కానున్నది అని చెప్పారు.