చెన్నై, ఫిబ్రవరి 26: హెల్త్ ఇన్సూరెన్స్ సేవల సంస్థ స్టార్ హెల్త్..తన హోమ్ హెల్త్‌కేర్ సర్వీసులను మరిన్ని నగరాలకు విస్తరించింది. రెండేండ్ల క్రితం ప్రారంభించిన ఈ సేవలకు కస్టమర్ల నుంచి విశేష స్పందన రావడంతో మరో 100 ప్రాంతాలకు విస్తరించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో ఆనంద్ రాయ్ తెలిపారు.
స్టార్ హెల్త్ పాలసీలు తీసుకున్న 85 శాతం మందికి ఇంటివద్దనే నగదు రహిత వైద్య సేవలు అందించింది. వైరల్ ఫీవర్, డెంగ్యూ రోగాలతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దనే వైద్య సేవలు కల్పించింది.