బెంగళూరు, మే 21 : ప్రముఖ విమానయాన సంస్థ స్టార్ ఎయిర్.. హైదరాబాద్‌తోపాటు భువనేశ్వర్ ఝార్సుగూడల మధ్య వారానికి ఆరు విమాన సర్వీసులు నడుపబోతున్నట్టు ప్రకటించింది. ప్రాంతీయ విమాన సర్వీసులను విస్తరించడంలో భాగంగా దక్షిణాది, తూర్పు భారతంల మధ్య విమాన కనెక్టివిటీ పెంచాలనే ఉద్దేశంతో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొంది.
దేశీయ టెక్నాలజీ హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్ నుంచి ఒడిశా రాష్ర్టాల మధ్య విమాన కనెక్టివిటీ పెంచడానికి ఈ నూతన సర్వీసులను ప్రారంభించినట్టు స్టార్ ఎయిర్ సీఈవో సిమ్రాన్ సింగ్ తెలిపారు. ఇరు నగరాల మధ్య పారిశ్రామికవేత్తలు, టూరిస్టులు, ఇతర ప్రయాణికులు మరింత సులభంగా విమాన ప్రయాణం చేయవచ్చునని చెప్పారు.