న్యూఢిల్లీ, జూన్ 2: కో-లివింగ్ సేవల సంస్థ స్టాంజా లివింగ్ తాజాగా నిర్వహించబడే అపార్ట్మెంట్ల వర్టికల్‌లోకి అడుగుపెట్టింది. 10 మిలియన్ డాలర్ల(రూ.77.5 కోట్లు) పెట్టుబడితో హైదరాబాద్‌తో సహా మరో ఐదు నగరాల్లో ఈ సేవలు అందించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే విద్యార్థులకు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు వసతి సదుపాయాలు సమకూరుస్తున్న స్టాంజా లివింగ్… హైదరాబాద్‌తోపాటు, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, పుణె, చెన్నైలలో ఈ నూతన సేవల ప్రారంభించింది. ఈ సరికొత్త వర్టికల్లలో భాగంగా కస్టమర్ కోరుకుంటున్న దాంట్లో రోజువారి అవసరాల నిమిత్తం మీల్స్, ఇంటర్నెట్, లాండ్రీ, హౌజ్‌కీపింగ్, మొబిలిటీ, సెక్యూరిటీ, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, రిక్రియేషనల్ యాక్టివిటీస్ తదితర సేవలు అందించనున్నది.