BDL | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) డైరెక్టర్ (టెక్నికల్)గా డీవీ శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు రక్షణ రంగంలో 3 దశాబ్దాలకుపైగా అనుభవం ఉంది. అంతకుముందు ఆయన బీడీఎల్‌లో అర్అండ్డీ జీఎంగా పనిచేశారు. బీడీఎల్‌లో అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ విభాగాన్ని స్థాపించడంలో శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారు. కాకతీయ వర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్లో బీటెక్, జేఎన్టీయూ నుంచి డిజిటల్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చేశారు. తదనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చేశారు.
ఆభరణాల ఎగుమతులు డౌన్
ముంబై, సెప్టెంబర్ 23: ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోవడంతో గత నెలకుగాను 2.01 బిలియన్ డాలర్ల విలువైన జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతి అయ్యాయని రత్నాల అభరణాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతైన 2.47 బిలియన్ డాలర్లతో పోలిస్తే 18.79 శాతం తగ్గినట్లు పేర్కొంది.