హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): పారిశ్రామికాభివృద్ధికి కేరాఫ్‌గా తెలంగాణ నిలిచిందని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జీటో) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో హైటెక్స్, హెచ్ఐసీసీలో 3రోజులపాటు జరిగే ‘జీటో కనెక్ట్-2025’ను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను శ్రీధర్ బాబు కోరారు.