న్యూఢిల్లీ, జూలై 7: స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ ట్రయింఫ్ మరోసారి ధరలను పెంచేసింది. ఏప్రిల్ నెలలో ధరలను సవరించిన సంస్థ..మళ్లీ జూలై నెలలో పలు మాడళ్ల ధరలను సవరించింది. వీటిలో ట్రయింఫ్ 350 సీసీ మోటర్‌సైకిళ్ల ధరలను 1.22 శాతం నుంచి 5 శాతం లేదా రూ.10 వేల వరకు పెంచింది.
దీంతో ఈ విభాగ బైకుల ధరలు రూ.2.09 లక్షల నుంచి రూ.2.75 లక్షలకు చేరుకున్నాయి. వీటితోపాటు స్పీడ్ 400 ధరను కూడా 2.34 లక్షల నుంచి రూ.2.40 లక్షలకు పెంచగా..స్క్రాంబ్లర్ 400 ఎక్స్ మాడల్ బైకును రూ.2.59 లక్షల నుంచి రూ.2.65 లక్షలకు పెంచింది.