న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: స్పైస్‌జెట్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.25 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.300 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 36 శాతం నష్టపోయి రూ.1,850.4 కోట్ల నుంచి రూ.1,178.7 కోట్లకు పడిపోయింది.