Spicejet | స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షాక్.. భారీగా పతనమైన ఎయిర్‌లైన్స్ స్క్రిప్ట్
Spicejet | ఇటీవలి సాంకేతిక సమస్యల నేపథ్యంలో 8 వారాల పాటు సగం విమాన సర్వీసులే నడపాలని స్పైస్‌జెట్‌ను డీజీసీఏ ఆదేశించింది.
Spicejet | ఇటీవల విమానాల్లో సాంకేతిక లోపాల నేపథ్యంలో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్‌కు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) గట్టి షాక్ ఇచ్చింది. సాంకేతిక అంశాలు, సేఫ్టీ తదితర అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని వచ్చే 8 వారాల పాటు అనుమతించిన వాటిల్లో 50 శాతం విమాన సర్వీసులు మాత్రమే నడుపాలని స్పైస్‌జెట్‌ను ఆదేశించింది.
స్పైస్‌జెట్‌కు డీజీసీఐ ఆదేశాలతో గురువారం స్టాక్ మార్కెట్లో ఆ ఎయిర్‌లైన్స్ స్క్రిప్ట్ భారీగా నష్టపోయింది. ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో 9.66 శాతం పడిపోయి 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.34.60 వద్దకు చేరుకున్నది. డీజీసీఏ ఆదేశాలపై స్పైస్‌జెట్ రియాక్టయింది. డీజీసీఏ ఆదేశాల ప్రభావం తమ విమాన సర్వీసులపై ఉండబోదని పేర్కొంది. తమ సంస్థ ఎటువంటి విమాన నర్వీసులను రద్దు చేయలేదన్నది.
ఇటీవల తలెత్తిన సాంకేతిక సమస్యలపై చర్యలు చేపట్టామని స్పైస్‌జెట్ తెలిపింది. డీజీసీఏ ఆదేశాలకు అనుగుణంగా తాము పని చేస్తామని వెల్లడించింది. గత నెల 31- ఈ నెల ఐదో తేదీ మధ్య ఎనిమిది స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్ యాజమాన్యానికి వివరణ ఇవ్వాలని డీజీసీఐ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- DGCA
- spice jet
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

