ముంబై, జూన్ 14: చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడునెలల కాలానికిగాను సంస్థ రూ.324.87 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.119 కోట్ల లాభంతో పోలిస్తే మూడింతల వరకు అధికమైంది.
కానీ, ఆదాయం మాత్రం ఏడాది ప్రాతిపదికన 16 శాతం తగ్గి రూ.1,446.37 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.1,719.3 కోట్ల ఆదాయాన్ని గడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.5,284 కోట్ల ఆదాయంపై రూ.580.74 కోట్ల లాభాన్ని గడించింది.