Hyundai KonaEV | దక్షిణ కొరియా కార్ల తయారీ కంపెనీ హ్యుండాయ్ మోటార్ ఇండియా త్వరలో దేశీయ మార్కెట్లోకి కోనా ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్నది. పూర్తిస్థాయిలో చార్జింగ్ చేస్తే 490 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. అడాస్‌లో మాదిరిగా సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. కోనా ఈవీ కారులో ఫీచర్లు, స్పెషిఫికేషన్లను హ్యుండాయ్ ఇండియా మోటార్ గురువారం అధికారికంగా వెల్లడించింది. న్యూ జనరేషన్ కోనా ఈవీ కారును ఈవీ నుంచి ఐసీఈ ప్రాసెస్‌లో రీ డిజైన్ చేసి డెవలప్ చేసింది. ఐసీఈ, హైబ్రీడ్, ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ ఆప్షన్లలో కోనా ఈవీ కారు మార్కెట్లో అందుబాటులోకి రానున్నది.
రెండు బ్యాటరీ ప్యాక్‌ల్లో సరికొత్త కోనా ఈవీ కారును హ్యుండాయ్ మోటార్ బ్యాటరీ అండ్ ఎలక్ట్రిక్ వర్షన్లలో లాంచ్ చేయనున్నది. 48.4 కిలోవాట్లు, 65.4 కిలోవాట్ల సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ల్లో వస్తోంది. సింగిల్ చార్జింగ్‌తో 490 కి.మీ. దూరం ప్రయాణించడం న్యూ జనరేషన్ కోనా ఈవీ కెపాసిటీ. 12.3-అంగుళాల డ్యుయల్ స్క్రీన్ డాష్‌బోర్డు, అడాస్, ఎల్ఈడీ లైటింగ్, ఎలక్ట్రానిక్ గేర్ సెలెక్టర్ వంటి ఫీచర్లు వస్తాయి.
ప్రపంచ మార్కెట్లో కోనా ఎలక్ట్రిక్ కారు ధరలను త్వరలో అప్డేట్ చేస్తామని హ్యుండాయ్ ఇండియా మోటార్ తెలిపింది. ప్రస్తుత కోనా ఈవీ కారు ధర భారత్‌లో రూ.25 లక్షలు. అదనంగా వస్తున్న ఫీచర్లు, కారు సామర్థ్యాన్ని బట్టి 2023 మోడల్ కోనా ఈవీ కారు ధర మరికొన్ని లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి రావచ్చు.
కోనా ఎలక్ట్రిక్ న్యూ జనరేషన్ కారు స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, రాప్రౌండ్ ఫ్రంట్ లైట్‌బార్, ఐకానిక్-5 డాష్‌బోర్డుపై 12.4 అంగుళాల రాప్రౌండ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వస్తుంది. బోస్ 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, కీ లెస్ ఎంట్రీ, ఓటా అప్డేట్స్, హెడ్స్అప్ డిస్ప్లే, కనెక్టెడ్ కారు టెక్నాలజీ, పవర్ టెయిల్ గేట్ తతదితర ఫీచర్లు ఉంటాయి. అడాస్, బ్లైండ్-స్పాట్ కొల్యూషన్ అవాయిడెన్స్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొల్యూషన్ అవాయిడెన్స్ అసిస్టెన్స్ సిస్టం తదితర ఫీచర్లు జత కలిశాయి.