Maruti Grand Vitara | గ్రాండ్ విటారాపై మారుతి స్పెషల్ డిస్కౌంట్.. గరిష్టంగా రూ.1.40 లక్షల వరకూ ధర తగ్గింపు..!
Maruti Grand Vitara | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన మిడ్ సైజ్ ఎస్యూవీ కారు గ్రాండ్ విటారాపై రూ.1.40 లక్షలు డిస్కౌంట్ ప్రకటించింది.
Maruti Grand Vitara | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి. గతంతో పోలిస్తే ఎస్‌యూవీల సేల్స్‌లో కార్ల తయారీ సంస్థలు పోటీ పడుతున్నాయి. అన్ని సెగ్మెంట్లలో పోటీ పడుతున్న మారుతి సుజుకి (Maruti Suzuki) ఎస్‌యూవీల్లో మిడ్‌సైజ్ ఎస్యూవీ (Mid Size SUV) గ్రాండ్ విటారా (Grand Vitara) కు రోజురోజుకు గిరాకీ పెరుగుతున్నది. గత నెలలో 15,784 యూనిట్ల గ్రాండ్ విటారా కార్లు విక్రయించింది. ఈ నేపథ్యంలో కార్ల విక్రయాలు పెంచుకోవడానికి మారుతి సుజుకి కారు గ్రాండ్ విటారాపై రూ.1.40 లక్షల డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) ధర రూ. 11,19,000 నుంచి (ఎక్స్ షోరూమ్) రూ.20,15,000 (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది. ఈ కారు స్ట్రాంగ్ హైబ్రీడ్ వేరియంట్ ఇంజిన్ లీటర్ పెట్రోల్‌పై 27.97 కి.మీ మైలేజీ ఇస్తుంది.
హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos), టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder), టాటా కర్వ్ (Tata Curvv), హోండా ఎలివేట్ (Honda Elevate), స్కోడా కుషాక్ (Skoda Kushaq), ఫోక్స్ వ్యాగన్ టైగూన్ (Volkswagen Taigun), ఎంజీ ఆస్టర్ (MG Astor) కార్లతో మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) పోటీ పడుతుంది. మారుతి సుజుకి (Maruti Suzuki) ఫ్లాగ్షిప్ ఎస్యూవీ కార్లలో గ్రాండ్ విటారా (Grand Vitara) ఉంటుంది. హైబ్రీడ్, మైల్డ్ హైబ్రీడ్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) పలు పవర్ట్రైన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ-సీవీటీ ఆప్షన్‌తో 1.5 లీటర్ల స్ట్రాంగ్ హైబ్రీడ్ వేరియంట్‌గా వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 115బీహెచ్పీ విద్యుత్, 122 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 1.5 లీటర్ల కే-సిరీస్ మైల్డ్ హైబ్రీడ్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 103 బీహెచ్పీ విద్యుత్, 137 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. సీఎన్జీ ఆప్షన్ (87బీహెచ్పీ విద్యుత్/121ఎన్ఎం టార్క్) విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో వస్తుంది. కే-సిరీస్ యూనిట్ ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ (సుజుకి ఆల్ గ్రిప్ టెక్నాలజీ)తో అందుబాటులో ఉంటుంది. ఆటో, స్పోర్ట్, స్నో, లాక్ డ్రైవ్ మోడ్ల్లో లభిస్తుంది.
గ్రాండ్ విటారాపై వేరియంట్ల వారీగా ఆఫర్లు
- మైల్డ్ హైబ్రీడ్ సిగ్మా (Mild Hybrid Sigma)- గరిష్టంగా రూ. 53,100 వరకూ..
- మైల్డ్ హైబ్రీడ్ డెల్టా (Mild Hybrid Delta)- గరిష్టంగా రూ. 88,100 లేదా డామినియన్ కిట్ వర్త్ రూ.48,599 + రూ. 52,100.
- మైల్డ్ హైబ్రీడ్ జేటా (Mild Hybrid Zeta)- గరిష్టంగా రూ.88,100 వరకూ లేదా డోమినియన్ కిట్ వర్త్ రూ.49,999 + రూ.51,100.
- మైల్డ్ హైబ్రీడ్ ఆల్ఫా (Mild Hybrid Alpha)- గరిష్టంగా రూ.88,100 వరకూ లేదా డామినియన్ కిట్ వర్త్ రూ.52,699 + రూ.48,100
- స్ట్రాంగ్ హైబ్రీడ్ (Strong Hybrid)- గరిష్టంగా రూ.93,100 వరకూ + ఫైవ్ ఇయర్ ఫ్రీ ఎక్స్టెండెడ్ వారంటీ
సీఎన్జీ వేరియంట్ (CNG)- గరిష్టంగా రూ. 38,100 వరకూ..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

