హైదరాబాద్, డిసెంబర్ 19: చౌక గృహాలకు రుణాలు అందించే ఎస్ఎంఎఫ్జీ గృహ శక్తి..తెలంగాణలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించబోతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు శాఖలు ఉండగా, వచ్చే రెండేండ్లకాలంలో మరో 3 నుంచి ఐదు శాఖలను ప్రారంభించాలనుకుంటున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో దీపక్ పట్కార్ ఈ సందర్భంగా తెలిపారు.
అలాగే దేశవ్యాప్తంగా 150 శాఖలు ఉండగా, 2024-25 నాటికి ఈ సంఖ్యను 300కి పెంచుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, రాజస్థాన్, ఎన్సీఆర్, గుజరాత్ రాష్ర్టాల్లో సంస్థ రూ.7,900 కోట్లకు పైగా గృహ రుణాలు మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో తెలంగాణలో రూ.639 కోట్ల రుణాలు మంజూరు చేసింది. వీటిలో రూ.15-20 లక్షల లోపు అధికంగా ఉన్నాయన్నారు. వీటిపై 10 శాతం నుంచి 13 శాతం లోపు వడ్డీని వసూలు చేస్తున్నది.