World Smallest Smart Phone | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ యూనిహెర్ట్జ్ (Unihertz) ప్రపంచంలోకెల్లా అతి తక్కువ డిస్ ప్లేతో కూడి జెల్లీ స్టొర్ (Jelly Star) స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. 3-అంగుళాల డిస్ ప్లేతో విత్ ట్రాన్స్పరెంట్ డిజైన్తో వచ్చింది. అత్యాధునిక ఆండ్రాయిడ్613 వర్షన్ తో పని చేస్తున్న స్మాలెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది.
నథింగ్ ఫోన్ 1 (Nothing 1) విత్ ట్రాన్స్పరెంట్ డిజైన్ మాదిరిగా ఈ ఫోన్ రేర్ ప్యానెల్ మీద ఎల్ఈడీ నోటిఫికేషన్ ఇస్తుంది. ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానెల్ నుంచి ఇంటర్నల్ విడి భాగాలు సైతం కనిపిస్తుంటాయి.
జెల్లీ స్టార్ (Jelly Star) ఫోన్ 3-అంగుళాల డిస్ ప్లే విత్ 480×854 పిక్సెల్ రిజొల్యూషన్ కలిగి ఉంటది. మీడియా టెక్ హెలియో జీ-99 ఒక్టాకోర్ ప్రాసెసర్ తో ఫోన్ పని చేస్తుంది.
ఫొటోగ్రఫీ కోసం 48 మెగా పిక్సెల్ ప్రైమరీ లెన్స్ సింగిల్ రేర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ కెమెరాతో వస్తుంది. పవర్ బ్యాకప్ కోసం 2000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే రోజంతా చార్జింగ్లోనే ఉంటది.
8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్గానే అందుబాటులోకి వచ్చిందీ స్మార్ట్ ఫోన్. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో దీన్ని పొడిగించవచ్చు. ప్రస్తుతానికి హాంకాంగ్ మార్కెట్లోనే విడుదలైనా.. భారత్ కరెన్సీలో సుమారు రూ.17 వేలు మాత్రమే. వచ్చే అక్టోబర్లో భారత్ మార్కెట్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.