టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. ఈ సినిమా మేకర్స్ అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. జానకిరామ్ మర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
1990ల కాలం నాటి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు మాడుగుల గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథ, పూర్తి స్థాయి పీరియాడికల్ యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. శ్రీవిష్ణు తనదైన శైలిలో వినోదం పండిస్తూనే, సరికొత్త షేడ్స్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా UA 16+ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.