Smriti Mandhana : భారత మహిళల క్రికెట్లో ఓ అధ్యాయం ముగిసింది. టీమిండియా చిరకాల కలను సాకారం చేస్తూ వన్డే వరల్డ్‌కప్ అందించిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సారథిగా వైదొలిగింది. ఆసియా క్రీడల్లో వరసగా రెండో స్వర్ణం గెలిచిన అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగింది. పద్నాలుగేళ్లుగా నాయకిగా చెరగని ముద్ర వేసిన హర్మన్‌ప్రీత్ ఇకపై ప్లేయర్‌గానే కొనసాగనుండగా.. తదుపరి స్మృతి మంధాన(Smriti Mandhana)కు బాధ్యతలు అప్పగించడం లాంఛనమే అనిపిస్తోంది. ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న మంధానను త్వరలోనే పూర్తి స్థాయి కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించనుందని సమాచారం.
దిగ్గజ క్రికెటర్లకు సాధ్యమవ్వని ఘనతలు, ఐసీసీ వన్డేవరల్డ్కప్ ట్రోఫీని కట్టబెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి బైబై చెప్పేసింది. 2012లో టీ20లు, 2016లో వన్డేలో.. 2022లో టెస్టులు.. ఇలా మూడు ఫార్మాట్లకు నాయకత్వం వహించిన తను.. పద్నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించింది. దూకుడైన ఆటతో, గెలుపే మంత్రగా చెలరేగిన హర్మన్‌ప్రీత్.. టీమిండియాను ఉన్నత శిఖరాలకు చేర్చింది. కోచ్ అన్మోల్ మజుందార్ సూచనలు, పటిష్టమైన స్క్వాడ్‌తో అద్భుతాలు చేసిన హర్మన్.. ఆసియా క్రీడల్లో స్వర్ణంతో మురిసింది.
𝘼 𝘾𝙃𝘼𝙋𝙏𝙀𝙍 𝘾𝙇𝙊𝙎𝙀𝙎 ♥️
Harmanpreet Kaur penned a heartfelt note looking back on her journey as she stepped down as India captain 🇮🇳
Read more ➡️ https://t.co/Nmj2xtyKXK https://t.co/nSD2OqqoJX
— ICC (@ICC) October 6, 2026
ఐచీ నగోయ నుంచి తిరిగి వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మంగళవారం నా జాబ్ ముగిసింది అంటూ కెప్టెన్సీ వదులుకుంది. తను ఈ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను గమనిస్తే.. వయసు 37కు చేరడం.. స్మృతి మంధానకు కెప్టెన్సీ ఇవ్వాలని మాజీల డిమాండ్లు రావడం, తాను సారథ్యానికి సిద్ధమేనని మంధాన ప్రకటించడం వంటివి ఆమెను ప్రభావితం చేసి ఉంటాయి.
అందుకే కాబోలు.. మరో సిరీస్ కోసం వేచి చూడకుండా ఆసియా కప్, ఆసియా క్రీడల ఛాంపియన్‌గా సగర్వంగా నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలిగింది హర్మన్. దాంతో.. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన కెప్టెన్సీ కల నిజమవ్వనుంది. స్వదేశంలో జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లో భారత జట్టు తలపడనుంది. అక్టోబర్ 16 నుంచి మొదలయ్యే ఈ సిరీస్ కోసం త్వరలోనే సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించనున్నారు. ఈ సమయంలోనే కెప్టెన్‌గా మంధాన పేరును ఖరారు చేసే అవకాశముంది.
హర్మన్‌ప్రీత్ వారసురాలిగా స్మృతి మంధానకే ఎక్కువ అవకాశాలున్నాయి. జట్టులో దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ వంటి సీనియర్లున్నా.. వైస్ కెప్టెన్‌గా ఉన్న మంధాన వీరి కంటే రేసులో ముందుంది. ఓపెనర్‌గా విధ్వంసక ఆటతో అలరించే తనకు హర్మన్ గైర్హాజరీలో సారథ్యం వహించిన అనుభవముంది. అంతేకాదు మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ను వరసగా రెండుసార్లు విజేతగా నిలిపింది మంధాన.

లార్డ్స్ మైదానంలో చరిత్రాత్మక టెస్టులో విజయం అనంతరం టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో మాట్లాడిన మంధాన.. ‘హర్మన్‌ప్రీత్ కౌర్ గైర్హాజరీలో జట్టును నడిపించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?’ అనే ప్రశ్నకు ‘అవును.. నేను రెఢీ’ అని చెప్పింది. ‘ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన మహిళల ఏకైక టెస్టు ఆడడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మ్యాచ్ గెలుపొందండం ఇంకా ఆనందంగా ఉంది. చరిత్రాత్మక మ్యాచ్‌లో భారత జట్టు విజయంలో భాగమవ్వడం నాకు చాలా ప్రత్యేకం అని పేర్కొంది. ఇప్పటివరకూ 18 టీ20లు, నాలుగు వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన మంధాన.. 15 విజయాలు సాధించింది.