హైదరాబాద్, నవంబర్ 24: కార్ల విక్రయ సంస్థ స్కోడా ఆటో.. రాష్ట్రంలో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించింది. మోడీ ఇండియా కార్స్‌తో కలిసి హైదరాబాద్‌లోని నాగోల్ వద్ద తన కొత్త రిటైల్ అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. 428 చ.మీ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అవుట్‌లెట్‌లో ఏడు కార్లు ఒకేసారి డిస్ప్లే చేయవచ్చును. సంస్థకు చెందిన వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో నూతన అవుట్లెట్లను ఆరంభించినట్లు, ముఖ్యంగా వచ్చే ఏడాది చివరినాటికి అమ్మకాలు రెండింతలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలియస్ తెలిపారు.