న్యూఢిల్లీ, జూన్ 14: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా…వినియోగదారులకు మరింత దగ్గర కావడానికి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో టచ్పాయింట్లను నెలకొల్పడానికి సిద్ధమైంది. డిసెంబర్ నాటికి తెలంగాణలోని వరంగల్, తమిళనాడులోని పొల్లాచి, పంజాబ్లోని అమృత్సర్ వంటి నగరాల్లో కొత్తగా టచ్పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఇప్పటికే తెలంగాణలోని కరీంనగర్, మీరట్లలో టచ్పాయింట్లను ప్రారంభించింది కూడా.