సంపన్నులుగా ఉండటం.. ధనికులుగా ఉండటానికి మధ్య చాలా తేడా ఉన్నది. హాలీవుడ్ నటుడు జానీ డెప్ ఒక్క రోలింగ్ స్టోన్స్ సినిమాతోనే 650 మిలియన్ డాలర్లు సంపాదించాడు. కానీ అతని చేతిలో పైసా నిలవదు. ఖర్చు చేయనిదే నిద్ర పట్టదు. ప్రస్తుతం అతని బ్యాంక్ ఖాతాలో 200 మిలియన్ డాలర్లు కూడా లేవు. అలాగే ఆండ్రూ హల్లమ్ బ్రిటిష్ కొలంబియాలో 19 ఏండ్లకే ఓ బస్ డిపోలో కనీస వేతనానికి మెకానిక్‌గా చేరాడు. అప్పట్నుంచి జీతంలో అధిక భాగాన్ని పొదుపు చేసి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఈ క్రమంలో 36 ఏండ్ల వయసులోనే మిలియనీర్ అయ్యాడు. కాబట్టి సంపాదనే కాదు.. దాన్ని పొదుపు చేసే నేర్పు కూడా ఉండాలి.
ఆర్థిక క్రమశిక్షణకు ఆరు సూత్రాలు