Singareni | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకెళుతున్నది. అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే అధనంగా వెయ్యికోట్లకు పైగా లాభాలు గడించినట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యకాలానికిగాను పన్ను చెల్లింపులకు ముందు రూ. 4 వేల కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించినట్టు పేర్కొన్నారు. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.2,932 కోట్లతో పోలిస్తే 36 శాతం అధికమని చెప్పారు. అలాగే గడిచిన ఆరు నెలల్లో బొగ్గు అమ్మకాల ద్వారా రూ.17,152 కోట్లు, విద్యుత్తు విక్రయాల ద్వారా రూ.2,286 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు.