హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : కార్బన్ డైయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతమైనట్లు సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ ప్రకటించారు. ఈ ప్రయోగం విజయవంతంకావడం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు.
విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో థర్మల్ విద్యుత్తు కేంద్రాల డిమాండ్ మేరకు బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచాల్సిన అవసరం ఉన్నదని ఆయన అధికారులను ఆదేశించారు. మంగళవారం సింగరేణిభవన్ నుంచి అన్ని ఏరియా జీఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. రోజుకు కనీసం 50 ర్యాకుల బొగ్గును రవాణా చేయాలని, అన్ని గనుల్లో వేసవి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.