హైదరాబాద్, అక్టోబర్ 11: హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు వారానికి 12 విమాన సర్వీసులు నడుపుతున్నట్టు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. హైదరాబాద్‌కు విమాన సేవలు ప్రారంభించి 20 ఏండ్లు పూర్తికానున్న నేపథ్యంలో సంస్థ సర్వీసుల సంఖ్యను పెంచుకుంటున్నది.
ప్రస్తుతం వారానికి ఏడు సర్వీసులు నడుస్తుండగా, ఈ నెల 29 నుంచి మరో ఐదుంటాయని కంపెనీ జనరల్ మేనేజర్ సే యెన్ చెన్ తెలిపారు. కాగా, సంస్థ అనుబంధ విభాగం స్కూట్ రోజువారి సర్వీసులను నిలిపివేసిన నేపథ్యంలో ఈ సర్వీసుల పెంపు కలిసిరానున్నది.