న్యూఢిల్లీ, జూన్ 30 : గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పుంజుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.6 వేలు ఎగబాకి రూ.2.30 లక్షలకు చేరుకున్నది.
కానీ, బంగారం ధరలు మరింత తగ్గాయి. డిమాండ్ పడిపోవంతో న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.800 తగ్గి రూ.1,45,800కి పడిపోయింది. అంతకుముందు ఇది రూ.1,46,600 గా ఉన్నట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.