Silver Rates | న్యూఢిల్లీ, ఆగస్టు 3: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.150 తగ్గి రూ.60,100కి చేరుకున్నది.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి రూ.1,700 దిగొచ్చి రూ.75 వేలకు జారుకున్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,935 డాలర్లకు పడిపోగా, వెండి 23.55 డాలర్లకు చేరుకున్నది.