న్యూఢిల్లీ, మే 28: వెండి వెలుగులు పంచింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి మంగళవారం ఏకంగా రూ.3 వేలకు పైగా పెరిగింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,100 ఎగబాకి రూ.95,950 కి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.92,850గా ఉన్నది. వెండితోపాటు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తులం పుత్తడి ధర రూ.130 పెరిగి రూ.72,950కి చేరుకున్నది. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.220 అందుకొని రూ.72,930కి, 22 క్యారెట్ ధర రూ.200 ఎగబాకి రూ.66,850కి చేరుకున్నది. కిలో వెండి మాత్రం రూ.3,500 ఎగబాకి మళ్లీ లక్ష రూపాయల పైకి చేరుకున్నది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి ధర రూ.1,01,000 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండికి డిమాండ్ అధికంగా ఉండటంతో ఔన్స్ ధర 31.50 డాలర్లకు చేరుకోవడంతో దేశీయంగా ధరలు పెరిగాయి.