Stock Market | స్టాక్ మార్కెట్ భారీ పతనం.. 442 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
Stock Market : భారత స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. బ్యాంకింగ్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ పరిణామాల కారణంగా సెన్సెక్స్ 442 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయింది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. బ్యాంకింగ్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ పరిణామాల కారణంగా సెన్సెక్స్ 442 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 78,151.45 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. తర్వాత నష్టాల బాటపట్టింది. మధ్యలో 78,151.45 పాయింట్లకు చేరుకుని, అనంతరం మళ్లీ నష్టాల్లోనే నడిచింది.
ఒక దశలో 783.16 పాయింట్లు నష్టపోయి 77,368.29 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. చివరకు 442.93 పాయింట్ల నష్టంతో 77,708.52 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 95.80 పాయింట్లు నష్టపోయి చివరకు 24,238.50 వద్ద ముగిసింది. అయితే, బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ మాత్రం 72.20 పాయింట్లు లాభపడింది. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 48.75 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకింగ్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడితోపాటు అమెరికా, ఇరాన్ యుద్ధం, చమురు ధరల పెరుగుదల వంటివి మార్కెట్ పతనానికి కారణాలు. సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో ముగిశాయి.
ఇందులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 5 శాతం, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 6 శాతం నష్టపోయాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ట్రెంట్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా రూపాయి స్వల్పంగా బలహీనపడింది. డాలర్‌తో రూపాయి మారక విలువ 96.44గా ఉంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 91 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర 4021 వద్ద కొనసాగుతోంది. జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి సహా అంతర్జాతీయ మార్కెట్లు సోమవారం నష్టాల్లోనే ముగిశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

