Stock Market | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. భారత్‌పై 26శాతం ప్రతికార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ సుకాల ప్రభావం గురువారం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. దాంతో మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. ప్రారంభంలోనే మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 343.75 పాయింట్లు పతనమై.. 76,273.69 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 88.15 పాయింట్లు తగ్గి.. 23,244.20 వద్ద కొనసాగుతున్నది. ట్రేడింగ్‌లో దాదాపు 106 షేర్లు లాభపడగా.. 234 షేర్లు పతనమయ్యాయి. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, విప్రో, టాటా మోటార్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇప్పటికే వరుస నష్టాలతో లక్షల కోట్ల సంపద ఆవిరి కాగా.. గురువారం సైతం భారీగా నష్టాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, అంతర్జాతీయ మార్కెట్లు సైతం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సుమారు నాలుగు శాతం నాస్డాక్ ఫ్యూచర్స్ డౌన్ అయ్యాయి. స్ట్రెయిట్ టైమ్స్, హంగ్‌సెంగ్, నిక్కీ225 నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికాకు ముఖ్యమైన భాగస్వామి అయినప్పటికీ.. ట్రంప్ రెండో ‘టారిఫ్ కింగ్’ భారత్‌ను అభివర్ణించారు. ట్రంప్ నిర్ణయం 50శాతం బేసిస్ పాయింట్లకుపైగా ప్రభావితం చేయగలదని అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థ మాక్వేరీ పేర్కొంది. 26 శాతం సుంకం భారతదేశ జీడీపీపై 30 బిలియన్ల మేర ప్రభావం చూడపే అవకాశం ఉందని పేర్కొంది. 2025 క్యాలెండర్ ఇయర్ చివరి నాటికి భారత్ కలిగి ఉండే 4.3 ట్రిలియన్ డాలర్ల జీడీపీలో దాదాపు 0.7శాతం ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది.