Stock Market Crash | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 104శాతం సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. అమెరికా సుంకాలపై చైనా వెనక్కి తగ్గకపోవడంతో తాజాగా కొత్త సుంకాలను ప్రకటించారు. ఈ క్రమంలో వాణిజ్య యుద్ధం భయాల నేపథ్యంలో మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రారంభంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో మొదలయ్యాయి. మొన్నటి రికార్డు స్థాయి నష్టాల నుంచి మంగళవారం కోలుకున్న మార్కెట్లకు చైనాపై విధించిన సుంకాలతో మార్కెట్ మరోసారి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.
మరో వైపు ఇవాళ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాలను ప్రకటించనున్నది. బుధవారం మార్కెట్లు కిత్రం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 73,673.06 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ప్రారంభంలోనే సెన్సెక్స్ 554.02 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం స్వల్పంగా కొలుకొని.. 184.62 పాయింట్లు నష్టంతో 74042.45 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ సైతం స్వల్పంగా కోలుకొని 72.7 పాయింట్ల నష్టంతో 22,463.15 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది. ట్రేడింగ్లో దాదాపు 364 షేర్లు లాభపడగా.. 422 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో హెచ్యూఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, టాటా మోటార్స్ ప్రధాన లాభపడగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, సిప్లా, ఓఎన్జీసీ నష్టపోయాయి.