న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు కొత్త చైర్‌పర్సన్‌గా షబ్నమ్ సిన్హా రానున్నారు. ఈ మేరకు సోమవారం బ్యాంక్ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మూడేండ్లపాటు బ్యాంక్ చీఫ్‌గా ఆమె ఉండనున్నారు. వచ్చే నెల 30న సునీల్ మిట్టల్ ఉద్యోగ విరమణ చేస్తుండటంతో ఆ స్థానంలోకి సిన్హా వస్తున్నారు.
కాగా, ప్రస్తుతం బ్యాంక్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా సిన్హా ఉన్నారు. మోసాల అదుపుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి ఆమె నాయకత్వం వహిస్తుండగా.. రిస్క్ మేనేజ్మెంట్, ఐటీ కమిటీల్లోనూ సభ్యురాలిగా ఉన్నారు.