ముంబై: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 కంపెనీల్లో హెచ్యూఎల్, టీసీఎస్ భారీగా లబ్ధి పొందాయి. టాప్-10 కంపెనీల్లో ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,31,173.41 కోట్లు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, విప్రో మార్కెట్ క్యాపిటల్ పెరిగితే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ భారీగా నష్టపోయాయి.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.50,234.21 కోట్లు పెరిగింది. దీంతో హెచ్యూఎల్ ఎం-క్యాప్ రూ.6,15,016.63 కోట్లకు చేరుకున్నది. ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.35,344.44 కోట్లు పెరిగి రూ.13,15,919.03 కోట్ల వద్ద స్థిర పడింది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,442.29 కోట్లు పెంచుకున్నది. దీంతో ఆ సంస్థ ఎం-క్యాప్ రూ.4,01,782.58 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ ఎం -క్యాప్ రూ.8,335.27 కోట్ల లబ్ధితో రూ.7,34,755.12 కోట్ల వద్ద స్థిరపడింది.
హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.3,512.87 కోట్లు పెరిగి రూ.4,91,729.99 కోట్ల వద్ద నిలిచింది. విప్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,385.11 కోట్ల నుంచి రూ.3,39,632.11 కోట్లకు దూసుకెళ్లింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.919.22 కోట్లతో రూ.13,60571.28 కోట్ల వద్ద స్థిరపడింది.
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఎం-క్యాప్ భారీగా రూ.21,776.05 కోట్లు తగ్గి రూ.3,63,187.07 కోట్ల వద్దకు చేరింది. ప్రైవేట్ బ్యాంకర్ ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,854.73 కోట్లు పతనమై రూ.4,71,497.28 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.5,947.03 కోట్లు తగ్గి రూ.8,37,756.50 కోట్ల వద్ద నిలిచింది.