హైదరాబాద్, అక్టోబర్ 27: ప్రతిమ గ్రూపుతో జట్టుకట్టినట్టు కొలంబియా పసిఫిక్ గ్రూపునకు చెందిన సెరెనా కమ్యూనిటస్ ప్రకటించింది. ఈ జాయింట్ వెంచర్లో భాగంగా హైదరాబాద్లో రూ.400 కోట్ల పెట్టుబడితో రెండు వృద్దులు నివాసాలను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించింది. దీంట్లోభాగంగా తన తొలి ప్రాజెక్టు సెరెనా బిల్వాని ప్రారంభించింది.
నగరంలో నెలకొల్పిన తొలి ప్రీమియం సీనియర్ లివింగ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. నగరానికి సమీపంలో శంకర్పల్లిలో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రెరా అనుమతి కూడా పొందింది. ఈ సందర్భంగా ప్రతిమ గ్రూపు డైరెక్టర్ ఏబీవీఎస్ ప్రకాశ్ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ వాసులకు అంతర్జాతీ ప్రమాణాలతో లివింగ్ అనుభవం అందించాలనే ఉద్దేశంతో సెరెనా కమ్యూనిటీస్తో జట్టుకట్టినట్టు చెప్పారు.