చెన్నై, ఆగస్టు 16: స్టార్టప్‌లకు బ్యాంకింగ్ అవసరాలు తీర్చడానికి ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ బ్యాం క్ ముందుకొచ్చింది. బుధవారం ఒకేరోజు దేశవ్యాప్తంగా 10 నగరాల్లో ప్రత్యే క సెల్‌లను ప్రారంభించింది. అహ్మదాబాద్‌తోపాటు బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నై, న్యూఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, కాన్పూర్, ముంబైలలో స్టార్టప్ సెల్స్‌ను ప్రారంభించినట్లు ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈవో ఎస్ఎల్ జైన్ తెలిపారు. స్టార్టప్‌లకు బ్యాంకింగ్ సేవలు, ముఖ్యంగా పేమెం ట్ గేట్వేస్, కార్పొరేట్ క్రెడిట్ కార్డుతోపాటు ఇతర బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.