74 వేల పైకి సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు ఒక్క శాతానికి పైగా ఎగబాకాయి.
- భారీగా లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు
- బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగషేర్లలో కొనుగోళ్లు
ముంబై, అక్టోబర్ 29: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు ఒక్క శాతానికి పైగా ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు శాంతించడం, అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయి. ఫలితంగా 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ తిరిగి 74 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 905 పాయింట్లు లేదా 1.24 శాతం ఎగబాకి 74,151.04 వద్ద స్థిరపడింది. 30 షేర్ల ఇండెక్స్ సూచీల్లో 26 షేర్లు లాభాల్లో ముగియగా..కేవలం నాలుగు నష్టపోయాయి.
మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 237.90 పాయింట్లు లేదా 1.05 శాతం అందుకొని 22,936.75 పాయింట్ల వద్ద స్థిరపడింది. లాభాల్లో ప్రారంభమైన షేర్లు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయని, ఫెడ్ వడ్డీరేట్లను ముట్టుకోకపోవడం, ఇంధన ధరలు తగ్గడం, ఎఫ్ఎంసీజీ అమ్మకాలు భారీగా పుంజుకోవడం ఈ రంగ షేర్లు భారీగా పెరిగాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. వీటికితోడు ఆర్థిక, ఐటీ, రియల్టీ, పవర్ రంగ షేర్లు కూడా లాభాల్లో ముగియడం కలిసొచ్చిందని, మధ్యాహ్నాం తర్వాత గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీల్లో మరింత జోష్ పెంచాయన్నారు.
- అదానీపోర్ట్స్ షేరు 5.17 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది.
- దీంతోపాటు కొటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎటర్నల్, బజాజ్‌ఫైనాన్స్, ఎస్బీఐ, హెచ్‌యూఎల్, టైటాన్, ఎన్టీపీసీ, బీఈఎల్ షేర్లు రెండు శాతానికి పైగా ఎగబాకాయి.
- అలాగే ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎయిర్టెల్, మహీంద్రా, ఎల్అండ్టీ, టీసీఎస్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, టాటాస్టీల్, ఇండిగో షేర్లు లాభాల్లో ముగిశాయి.
- మరోవైపు, ట్రెంట్, మారుతి, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు పతనం చెందాయి.
- గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ 1.18 శాతం తగ్గి 113.96 డాలర్లకు పడిపోయాయి.
- జియో ప్లాట్‌ఫామ్ షేర్లు స్వల్పంగా పెరిగి రూ.1,423.05 వద్ద నిలిచాయి.
- రంగాలవారీగా యుటిలిటీ సూచీ 3.11 శాతం బలపడగా, పీఎస్‌యూ బ్యాంకింగ్ 2.63 శాతం, రియల్టీ 2.44 శాతం, ఎఫ్ఎంసీజీ 1.94 శాతం, సర్వీసెస్ 1.77 శాతం, పవర్ 1.63 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.55 శాతం, టెలికాం 1.30 శాతం చొప్పున బలపడ్డాయి.
అల్ఫాబెట్ షేర్లు కుదేలు
న్యూయార్క్: గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ షేర్లు భారీ నష్టాలకు లోనవుతున్నాయి. గురువారం 12 శాతానికిపైగా క్షీణించాయి. దీంతో ఒక్కరోజే మదుపర్ల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. ఈ ఏడాది మూడో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను బుధవారం కంపెనీ ప్రకటించిన ఆర్థిక ఫలితాలు.. మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణలకు దిగుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

