Stock Market : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. బుధవారం బీఎస్ఈ మోస్తరుగా నష్టపోయింది. సెన్సెక్స్ 270.84 పాయింట్లు, నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ ఉదయం 81,794.65 పాయింట్ల వద్ద నష్టంతో ప్రారంభమైంది. ఒక దశలో 81,124.45 పాయింట్ల కనిష్టాన్ని చేరుకుంది.
చివరకు 270.84 పాయింట్ల నష్టంతో 81,909.63 వద్ద ముగిసింది. నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి, 25,157.50 వద్ద ముగిసింది. గ్లోబల్ పాలిటిక్స్, మార్కెట్ అనిశ్చితి వంటివి సెంటిమెంట్ ను దెబ్బతీయడంతో స్టాక్ మార్కెట్ నష్టాలు పొందింది. సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ట్రెంట్, బీఈఎల్ ఎక్కువగా నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, రిలయన్స్, ఇండిగో, ఎటెర్నల్ వంటి సంస్థలు లాభాలు చవిచూశాయి. మరోవైపు డాలర్ తో రూపాయి విలువ మరింత తగ్గింది. అత్యల్ప కనిష్ట స్థాయి 91.73కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 64.33 వద్ద కొనసాగింది. బంగారం ధర ఔన్సుకు 4,862 డాలర్ల వద్ద కొనసాగింది.
మరోవైపు భారతీయ మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,800 వరకు చేరింది. ఇది అంతకుముందు రోజుతో పోలిస్తే రూ.9,000 అదనం. అంటే ఒక్కరోజులోనే తొమ్మిది వేల రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,900గా ఉంది. వెండి కిలో ధర రూ.3,30,000గా ట్రేడవుతోంది.