Stocks | యూఎస్ ఫెడ్ ఎఫెక్ట్.. చివర్లో స్వల్ప లాభాలతో స్టాక్స్ ముగింపు
Stocks | వడ్డీరేట్లపై యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించారు. బుధవారం అంతా నష్టాలతో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగింపు సమయానికి కొన్ని నిమిషాల ముంగిట స్వల్ప లాభాలతో ముగిశాయి.
Stocks | వడ్డీరేట్లపై యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించారు. బుధవారం అంతా నష్టాలతో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగింపు సమయానికి కొన్ని నిమిషాల ముంగిట స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 34 పాయింట్ల లబ్ధితో 69,585 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 20 పాయింట్లు పుంజుకుని 20,926 పాయింట్ల వద్ద స్థిర పడింది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్-30లో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, ఎస్బీఐ, టైటాన్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐటీసీ, మారుతి సుజుకి షేర్లు 3.6 శాతం వరకు పుంజుకున్నాయి. మరోవైపు టీసీఎస్, ఇన్ఫోసిస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర స్టాక్స్ రెండు శాతం వరకూ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.06 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 0.73 శాతం లబ్ధి పొందాయి. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ 1.3 శాతం, ప్రైవేట్ బ్యాంక్స్ ఇండెక్స్ 0.07 నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు ఒక శాతం వరకు లాభంతో ముగిశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

