ముంబై, ఆగస్టు 20 : దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 213.45 పాయింట్లు అందుకొని 81,857.84 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ 69.90 పాయింట్లు ఎగబాకి 25 వేల పైకి 25,050.55 వద్ద నిలిచింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేరు 3.88 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది.
దీంతోపాటు టీసీఎస్, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటర్స్, ట్రెంట్, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా ఐటీ 2.70 శాతం లాభపడగా.. టెక్నాలజీ 2.22 శాతం, రియల్టీ 1.04 శాతం, టెలికాం షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది.