Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు దేశీయ మార్కెట్లపై ప్రభావం పడింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయడంతో యుద్ధ వాతావరణ నెలకొన్నది. ఈ క్రమంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు నష్టాల్లో ఊభిలోకి జారుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండుశాతానికిపైగా పడిపోగా.. దాదాపు రూ.11లక్షలకోట్లకుపైగా మదుపరుల సంపద ఆవిరైంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు ముడి చమురు ధరలు పెరిగాయి. ఇక బీఎస్ఈలో లిస్ట్ అయిన అన్ని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.63లక్షల కోట్లు తగ్గి రూ.469 కోట్లకు పడిపోయింది. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 83,002.09 మొదలైంది. మొదట్లోనే 1,250 పాయింట్లకుపైగా నష్టాల్లో ట్రేడింగ్ మొదలైంది. ఆ తర్వాత మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 82,434.02 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది.
చివరకు 1,769.19 పాయింట్ల నష్టంతో 82,497.10 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 546.80 పాయింట్లు పతనమై.. 25,250.10 వద్ద ముగిసింది. ఇటీవల వరుస లాభాలతో స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులను సృష్టిస్తూ వచ్చాయి. దాదాపు రెండు నెలల అనంతరం పతనమ్యాయి. ట్రేడింగ్‌లో దాదాపు 1,077 షేర్లు పురోగమించగా.. 2740 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో బీపీసీఎల్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ లాభపడ్డాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. రియాల్టీ 4.5 శాతం, ఆటో, బ్యాంక్, మీడియా, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్ ఇండెక్స్ 2నుంచి 3శాతం చొప్పున నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 2శాతం చొప్పున పతనమయ్యాయి.