Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని వ్యతిరేక పవనాలతో పాటు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతున్న నేపథ్యంలో నష్టాలబాటపట్టాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,758.07 లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నది. మళ్లీ సూచీలు దేశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 81,781.40 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 80,905.64 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది. చివరకు 494.75 పాయింట్ల నష్టంతో 81,006.61 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 221.50 పాయింట్లు పతనమై.. 24,749.80 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 1,199 షేర్లు పురోగమించాయి. మరో 2,580 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, నెస్లే, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్ సర్వీస్ నష్టపోయాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ, పవర్ గ్రిడ్ కార్ప్, ఎస్బీఐ లాభపడ్డాయి. సెక్టార్లలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ ఒకశాతం పడిపోయింది. ఆటో, మీడియా, రియల్టీ రెండు నుంచి మూడుశాతం వరకు తగ్గగా.. మిగతా రంగాల సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒకశాతానికి పైగా నష్టపోయాయి.