Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల పవనాలు.. ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాల కారణంగా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,646.60 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలయ్యాయి. మళ్లీ ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 81,932.15 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. 81,358.26 కనిష్ఠానికి చేరుకున్నది. చివరకు 318.76 పాయింట్ల నష్టంతో 81,501.36 వద్ద ముగిసింది.
నిఫ్టీ 86.05 పాయింట్ల నష్టంతో 24,971.30 వద్ద ముగిసింది. 30 షేర్ల సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, టైటాన్ నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభపడ్డాయి. సెక్టార్లలో, ఆయిల్, గ్యాస్, రియల్టీ, టెలికాం సూచీలు లాభాల్లో ముగియగా.. ఆటో, ఐటీ, ఫార్మా, మీడియా 0.5శాతం నుంచి ఒకశాతం వరకు పతనమయ్యాయి.