Sensex Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నా దేశీయ సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. ఇవాళ ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సూచీలు పుంజుకున్నాయి. చివరకు 229.84 పాయింట్లు పెరిగి.. 71,336.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 91.90 పాయింట్లు పెరిగి 21,441.30 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,063 షేర్లు పురోగమించగా.. 1,325 షేర్లు పతనమయ్యాయి. 109 షేర్లు మాత్రం మారలేదు.
నిఫ్టీలో దివీస్ లేబొరేటరీస్, హీరో మోటోకార్ప్, అదానీ ఎంటర్ప్రైజెస్, హిందాల్కో, ఎన్టీపీసీ అత్యధికంగా లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా మోటార్స్ నష్టపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినహా, చమురు అండ్ గ్యాస్, పవర్, మెటల్, ఆటో, హెల్త్‌కేర్ ఒక్కొక్కటి ఒక్కో శాతం పెరిగాయి. దీంతో అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగాయి.