Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. పొద్దంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు.. చివరి సెషన్లో పుంచుకోవడంతో లాభాల్లోకి వచ్చాయి. గ్లోబల్ మార్కెట్లో ప్రతికూల ప్రభావంతో దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. బ్యాంకింగ్ స్టాక్స్ రాణించడంతో లాభాలను ఆర్జించాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే.. ఉదయం సెన్సెక్స్ 76,996.78 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 76,543.77 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. ఒక దశలో 77,110.23 పాయింట్ల గరిష్ఠానికి పెరిగింది.
చివరకు 309.40 లాభంతో 77,044.29 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 108.65 పాయింట్లు పెరిగి.. 23,437.20 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,561 షేర్లు లాభపడ్డాయి. 1,244 షేర్లు నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ట్రెంట్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. మారుత సుజుకీ, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, టాటా మోటార్స్ నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా మినహా మిగతా అన్ని సూచీలు మీడియా, పీఎస్‌యు బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటి నుంచి రెండుశాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం వృద్ధిని నమోదు చేసింది.