Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఉదయం మార్కెట్లు లాభాల్లోనే మొదలయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,928.95 పాయింట్ల లాభంతో మొదలైంది. ఇంట్రాడేలో 81,867.23 పాయింట్ల కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. గరిష్టంగా 82,492.24 పాయింట్ల దాకా పెరిగింది. చివరకు 455.38 పాయింట్ల లాభంతో 82,176.45 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 148 పాయింట్లు పెరిగి 25,001.15 వద్ద ముగిసింది. దాదాపు 2213 షేర్లు లాభపడగా.. మరో 1,700 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో బజాజ్ ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎంఅండ్ఎం, హిందాల్కో, ట్రెంట్, నెస్లే, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, లార్సెన్, టెక్ మహీంద్రా లాభపడ్డాయి. ఎక్స్టర్నల్, కొటక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, టాటాస్టీల్, మారుతి సుజుకీ, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టపోయాయి.