Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలతో మార్కెట్లు వరుస ఐదోరోజు నష్టపోయాయి. కిత్రం సెక్షన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 74,365.88 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 74,493.55 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్.. 73,668.73 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 617.30 పాయింట్లు పతనమై.. 73,885.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 216.05 పాయింట్లు తగ్గి.. 22,488.65 వద్ద ముగిసింది.
ట్రేడింగ్‌లో దాదాపు 993 షేర్లు పురోగమించగా.. 2395 షేర్లు పతనమయ్యాయి. మరో 461 షేర్లు మారలేదు. నిఫ్టీ అత్యధికంగా టాటా స్టీల్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో టైటాన్ కంపెనీ భారీ నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాపడ్డాయి. సెక్టార్లలో బ్యాంక్ ఇండెక్స్ 0.5 శాతం పడింది. ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఐటీ, హెల్త్‌కేర్ ఒకటి నుంచి రెండుశాతం వరకు క్షీణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.2 శాతం చొప్పున తగ్గాయి.