హైదరాబాద్, అక్టోబర్ 8: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ సెలెక్ట్ మొబైల్స్..రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు ఐదు స్టోర్లను ప్రారంభించింది. గద్వాల్తోపాటు జడ్చర్ల, జోగిపేట్, భూపాలపల్లి, ఇల్లందులలో ఏర్పాటు చేసిన స్టోర్లను శుక్రవారం ఆరంభించింది. దీంతో స్టోర్ల సంఖ్య 85కి చేరుకున్నదని, త్వరలో ఈ సంఖ్య 100కి పెంచుకోనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి రేతినేని తెలిపారు.