న్యూఢిల్లీ, జూన్ 5: బేసిక్ సర్వీస్ డీమ్యాట్ ఖాతా (బీఎస్డీఏ) పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ బుధవారం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఇది రూ.2 లక్షలుగానే ఉన్నది. సెక్యూరిటీస్ మార్కెట్లో రిటైల్ మదుపరుల భాగస్వామ్యాన్ని ఇంకా పెంచాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ మేరకు తమ కన్సల్టేషన్ పేపర్లో సెబీ పేర్కొన్నది.
కాగా, రెగ్యులర్ డీమ్యాట్ ఖాతాకు మరింత బేసిక్ వెర్షనే ఈ బీఎస్డీఏ. 2012లో దీన్ని సెబీ పరిచయం చేసింది. స్మాల్ పోర్ట్ఫోలియోలున్న మదుపరులపై డీమ్యాట్ చార్జీల భారాన్ని తగ్గించాలనే ఈ బేసిక్ సర్వీస్ డీమ్యాట్ ఖాతాలను సెబీ అందుబాటులోకి తెచ్చింది. ఒక మదుపరి బీఎస్డీఏలో రూ.2 లక్షలదాకా డెట్ సెక్యూరిటీలను ఉంచుకోవచ్చు. డెట్ సెక్యూరిటీలు కానివి కూడా రూ.2 లక్షలదాకా పెట్టుకోవచ్చు. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 26దాకా మదుపరుల నుంచి అభిప్రాయాలను సెబీ కోరుతున్నది.
సెబీ ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు