న్యూఢిల్లీ, నవంబర్ 6: మరో నాలుగు సంస్థల ఐపీవో ప్రతిపాదనకు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంట్లో హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్ కూడా ఉన్నది. దీంతోపాటు రుబికాన్ రీసర్చ్, సనాథన్ టెక్స్టైల్స్, మెటల్‌మ్యాన్ ఆటో కూడా ఉన్నాయి. ఈ నాలుగు సంస్థలు గరిష్ఠంగా రూ.3 వేల కోట్ల వరకు నిధులు సమీకరించనున్నాయి. దీంట్లో రుబికాన్ రీసర్చ్ రూ.1,085 కోట్ల నిధులను సేకరించనుండగా, సాయి లైఫ్ సైన్సెస్ తాజా ఈక్విటీ షేర్లను జారీచేయడం ద్వారా రూ.800 కోట్ల నిధులను సేకరించాలనుకుంటున్నది.
థార్‌పై 3 లక్షల వరకు రాయితీ
ముంబై, నవంబర్ 6: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా..పలు మాడళ్లను తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది. ఇప్పటికే పలు మాడళ్ల ధరలను తగ్గించిన సంస్థ..తాజాగా థార్ 3-డోర్లు, థార్ రాక్స్ మాడళ్లపై రూ.3 లక్షల వరకు రాయితీతో విక్రయిస్తున్నది. 2 లీటర్ల టర్బో పెట్రోల్, 2.2 లీటర్ల టర్బో డీజిల్ ఇంజిన్‌తో ఈ కారును తయారు చేసింది సంస్థ. రెండు నెలల క్రితం ఈ కారుపై రూ.1.6 లక్షల వరకు రాయితీ ఇచ్చిన సంస్థ..ఈసారికిగాను ఈ డిస్కౌంట్‌ను రెండు రెట్లు పెంచుతూ రూ.3 లక్షల వరకు పెంచింది.
హైదరాబాద్‌లో వాయు ఫుడ్ యాప్
హైదరాబాద్, నవంబర్ 6: రాష్ట్ర మార్కెట్లోకి మరో ఫుడ్ ఆధారిత సేవల సంస్థ ప్రవేశించింది. ఇప్పటికే జోమా టో, స్విగ్గీలు సేవలు అందింస్తుండగా తాజాగా ‘వాయు’ తన సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. జీరో కమిషన్ ఫుడ్ డెలివరీ యాప్ సేవలు అందిస్తున్న తొలి సంస్థ వాయు కావడం విశే షం. తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్‌తో కలిసి హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో ఈ సేవలు అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో మందార్ ల్యాండ్ తెలిపారు. ఈ జంటనగరాల్లో ఉన్న 3 వేల కు పైగా హాటళ్లతో ఒప్పందం కుదుర్చుకొని ఆహార పదార్థాలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థ ముంబై, పుణె, జైపూర్, బెంగళూరులో సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.