న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఓ కొత్త అసెట్ క్లాస్‌ను పరిచయం చేసింది. అసెట్ కన్స్ట్రక్షన్లోని ఫ్లెక్సిబిలిటీ టర్మ్స్ల్లో మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసుల మధ్యనున్న అంతరాన్ని అధిగమించడానికి హై-రిస్క్ ప్రొఫైల్ ఇన్వెస్టర్ల కోసం దీన్ని తెచ్చింది. ఇందులో ఒక్కో ఇన్వెస్టర్‌కు కనీస పెట్టుబడి పరిమాణం రూ.10 లక్షలుగా ఉన్నది. అలాగే ప్యాసివ్ స్కీముల కోసం ఎంఎఫ్ లైట్-టచ్ ఫ్రేమ్‌వర్క్‌కు ఆమోదం తెలిపింది. కాగా, సోమవారం జరిగిన సెబీ బోర్డు సమావేశంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సవరణసహా మొత్తం 17 ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు. సెబీ చైర్పర్సన్ బచ్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత జరిగిన తొలి బోర్డు సమావేశం ఇదే.