తప్పనిసరేమీకాదు.. మీ ఇష్టమంతే
దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన సంస్థల్లో సీఎండీ హోదా విభజనపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వెనక్కి తగ్గింది. చైర్మన్ లేదా చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా సీఈవో పదవులు ఒక్కరి వద్దే ఉండొద్దన్నది తప్పనిసరేమీ కాదని, ఆయా సంస్థల ఇష్టమని, ఈ విషయంలో స్వచ్చంధంగా నిర్ణయం తీసుకోవచ్చని మంగళవారం సెబీ స్పష్టం చేసింది.
- లిస్టెడ్ కంపెనీల్లో సీఎండీ పదవి విభజనపై వెనక్కి తగ్గిన సెబీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన సంస్థల్లో సీఎండీ హోదా విభజనపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వెనక్కి తగ్గింది. చైర్మన్ లేదా చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా సీఈవో పదవులు ఒక్కరి వద్దే ఉండొద్దన్నది తప్పనిసరేమీ కాదని, ఆయా సంస్థల ఇష్టమని, ఈ విషయంలో స్వచ్చంధంగా నిర్ణయం తీసుకోవచ్చని మంగళవారం సెబీ స్పష్టం చేసింది. సీఎండీ ఒక్కరే ఉంటారా?.. లేక చైర్మన్ ఒకరు, ఎండీ/సీఈవోగా మరొకరు ఉంటారా?.. అన్నది ఆయా సంస్థల ఇష్టమేనని ప్రకటించింది. స్టాక్ మార్కెట్లలో లిైస్టెన టాప్-500 సంస్థల్లో సీఎండీ పదవి విభజన ఈ ఏడాది ఏప్రిల్‌లోగా పూర్తికావాలని సెబీ డెడ్‌లైన్ పెట్టిన విషయం తెలిసిందే. నిజానికి 2020 ఏప్రిల్ 1లోగానే ఈ విభజన పూర్తవ్వాలని సెబీ గతంలో గడువు పెట్టింది. అయితే కంపెనీ ప్రతినిధుల విజ్ఞప్తి, మరింత సమయం కావాలని కోరడంతో పెంచారు. ఇప్పుడు దీన్ని తప్పనిసరేమీ కాదని ప్రకటించింది. ఇదిలావుంటే దేశీయ కంపెనీలు ఒకవేళ ఈ అంశంపై ఏదైనా అభిప్రాయాన్ని కలిగిఉంటే సెబీ దాన్ని తప్పక పరిశీలించాలని, నేనైతే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
కొత్త సంస్కరణలు తేవాలి
దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేయడానికి తర్వాతి తరం కొత్త సంస్కరణలను తీసుకురావాలని సెబీకి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలతో దేశీయ మార్కెట్లలో ఏర్పడే అలజడిపట్ల అప్రమత్తంగా ఉండాలని, దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్నారు. మంగళవారం సెబీ బోర్డునుద్దేశించి మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇప్పటికే తీసుకున్న పలు సెబీ నిర్ణయాలను కొనియాడారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

