న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ప్రముఖ ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ ష్నైడర్…భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్లాంట్ల కెపాసిటీని, ఆధునీకరించడానికి రూ.3,200 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ సీఈవో, ఎండీ దీపక్ శర్మ తెలిపారు.
భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించాలనే తమ ముఖ్య లక్ష్యమని, ఇందుకోసం 350 మిలియన్ల యూరోలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్టు, దీంతోపాటు 2026 నాటికి అదనంగా 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దీంట్లోభాగంగా తెలంగాణతోపాటు గుజరాత్, కర్ణాటక, బెంగాల్, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఖర్చు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.